తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కూడా కలవనున్నట్లు గా సమాచారం. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన మమతాబెనర్జీ ప్రధాని మోడీని కలవనుండడం దేశ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.