Health
oi-Garikapati Rajesh
మన శరీరంలో ప్రతి భాగానికి ఎముకలు చాలా ముఖ్యమైనవి. ఎముకలు బలంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎముకల్లో నొప్పి, బలహీనత ఉండటంవల్ల తర్వాత అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులకు ఎముకల బలాన్ని కాపాడుకోవాలి. అవిసె గింజలు బాగా మేలు చేస్తాయి. కొవ్వును కరిగించి, ఎముకలను బలంగా చేయడంలో వీటికి కీలక పాత్ర.
పాలతో కలిపి తీసుకోవడం…:అవిసె గింజలను పాలతో కలిపి తీసుకోవడంవల్ల ఎముకలకు బలం అందుతుంది. ఎముకలకు అవసరమైన పోషణను అవిసె గింజలు అందిస్తాయి.
ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. పెద్దలు తమ బలాన్ని కాపాడుకోవడానికి లడ్డుల్లా చేసిన అవిసె గింజలను తినొచ్చు.

పాలు, అవిసె గింజల్లోని పోషకాలు..:పాలు, అవిసె గింజల్లో అనేక పోషకాలుంటాయి. రెండింటిలోను కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, చక్కెర కొవ్వుకి మూలాలు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఫాస్పరస్, జింక్, ఫైబర్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ బి12, విటమిన్ డి మొదలైనవి అందుతాయి.
ఎముకలకు పోషణ:బలమైన ఎముకలకి కాల్షియం అవసరమవుతుంది. ఎముకల బలం అనేది కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. అయితే కాల్షియంతోపాటు మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ డి, జింక్ కూడా అవసరమవుతాయి. పాలు, అవిసె గింజనలను కలిపి తీసుకోవడంవల్ల ఈ పోషకాలన్నీ లభిస్తాయి. పాలు కాల్షియానికి మూలం. పాలు తీసుకుంటే ఎముకలు బలంగా అవడమే కాకుండా శరీరానికి బాగా ఉపయోగపడి దృఢంగా అవడానికి తోడ్పడుతుంది.
షుగర్ పేషెంట్స్‌కి మంచిది..:పాలలో అవిసె గింజల పొడిని కలిపి తాగడం వల్ల షుగరు వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అవిసెలను పాలలో కలిపి తీసుకుంటే పేగులకి ఎంతో ఉపయోగం. అవిసెల్లోని పీచు పదార్థం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు తోడ్పడుతుంది. పీచుపదార్థాన్ని తీసుకోవడం ద్వారా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రేగులు కష్టపడాల్సిన అవసరం ఉండదు. జీర్ణక్రియను మెరుగుపరచడంవల్ల జీర్ణవ్యవస్థకి సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.
* రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
* బ్రెయిన్ పవర్ పెరుగుతుంది
* గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
* క్యాన్సర్స్ దూరం
* శరీరానికి బలం
English summary
Bones are very important to every part of our body.
Story first published: Wednesday, May 10, 2023, 13:35 [IST]