మనకు కనపడినంతవరకు సాధారణంగా ఉండే వ్యక్తులు కూడా కొద్దిరోజుల వ్యవధిలోనే బాగా లావై కనపడటం చూస్తుంటాం. అతి తక్కువ కాలంలోనే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుండటాన్ని మనం గమనిస్తుంటాం. బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం చేస్తుండేవారిలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.