ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదు అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ప్రజల్లో భాగమేనన్నారు. ప్రజాప్రతినిధుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉద్యోగాలకు రాలేదని, కష్టపడి పరీక్ష రాసి సంపాదించుకున్నామని చెప్పారు. చట్టపరంగా తమకు రావల్సిన జీతభత్యాలు