Health
oi-Dr Veena Srinivas
సోంపు లేదా సోపు వాటర్ నిత్యం సేవించడం వల్ల మన పొట్టకు ఎంతో మేలు జరుగుతుంది. సోంపు వాటర్ మన శరీరాన్ని చల్లబరుస్తుంది. సోంపు లో ఐరన్, మినరల్స్, పొటాషియం,విటమిన్ సి, జింక్ ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది బరువు తగ్గడం కోసం కూడా నిత్యం సోంపు వాటర్ తాగుతారు.
ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకుని అందులో కొన్ని సోంపు గింజలు వేసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున సోంపు వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతారు. సోంపు శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అనేక క్యాన్సర్లు రాకుండా తగ్గించడంలో సోంపు పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. సోంపు గింజలతో చేసుకునే పానీయం వల్ల మన కళ్ళకు మేలు జరుగుతుంది.

సోంపు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సోంపు శ్వాసకోస సంబంధిత సమస్యలను, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో కూడా సోంపు గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అయితే సోంపు వాటర్ ను ఎక్కువగా తాగడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది.
సోంపు ఈస్ట్రోజనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా దీన్ని తాగితే హాని కలుగుతుందని చెబుతారు. అంతేకాదు కొంతమందికి సోంపు అలర్జీ ఉంటుంది. అటువంటి వారు సోంపు వాటర్ తాగితే వారు అలర్జీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు, క్షయ వ్యాధి నివారణకు మందులు వాడేవారు సోంపు వాటర్ తాగడానికి ముందు వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాల్సిందే.
తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోతే సోంపు వాటర్ ను తాగడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సోంపు వాటర్ బరువు తగ్గించడంతో పాటు, శరీర వేడిని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. కడుపును నిండుగా ఉంచుతుంది. శక్తిని వేగంగా శరీరానికి అందించటంలో సహాయపడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
English summary
Along with weight loss, regular consumption of healthy fennel water is beneficial. But people with these diseases need to be careful.
Story first published: Friday, May 26, 2023, 19:33 [IST]