న్యూఢిల్లీ: దేశంలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, జీఎస్టీ విధింపు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇక యుద్ధానికి తెర తీసింది. ఇవ్వాళ్టి నుంచే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలో 144 సెక్షన్ను కూడా విధించారంటే ఈ ఆందోళనల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.