వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోరాడమని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతుంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం తమలోతామే పోరాడుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రత్యర్థిని ఓడించే బదులు వారిలో వారినే ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీపై రాజకీయం చేయమంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులపై రాజకీయం చేస్తున్నారు. వీటన్నింటినీ