
చర్మ సౌందర్యం కోసం విటమిన్ ఏ
ప్రోటీన్ ఉన్నమంచి ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం మనం అటువంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. చర్మం అందంగా, నిగారింపును సంతరించుకోవాలంటే, ముడతలు పడకుండా ఉండాలంటే, చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలంటే విటమిన్ ఏ అవసరం ఎంతైనా ఉంటుంది. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండ ప్రభావం మన చర్మం పైన పడకుండా విటమిన్ ఏ కాపాడుతుంది. ఇక చర్మం పైన ఏవైనా గాయాలు అయితే మానాలన్నా కూడా విటమిన్ ఏ ఎంతగానో ఉపయోగపడుతుంది.

విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారం ఇవే
చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడంలో విటమిన్ ఏ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఆకుకూరల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్, చిలకడదుంప, ఆకుకూరలు, పాలు, గుమ్మడికాయ, టమాటో, బఠానీలు, అవకాడో, బీన్స్, చేపలు మొదలైన వాటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.

విటమిన్ సీ ఉన్న ఈ ఆహారాలతో బోలెడు బెనిఫిట్స్
చర్మం అందంగా ఉండాలంటే విటమిన్ సి అవసరం కూడా ఎంతైనా ఉంది. విటమిన్ సి చర్మకణాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి, జామ, బొప్పాయి, ఉసిరికాయ, నిమ్మకాయ, బ్రోకలీ, టమోటా, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కివి పండు మొదలైన వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.

విటమిన్ ఈ ఉన్న ఆహారాలు తీసుకుంటే స్కిన్ సాఫ్ట్
చర్మం డ్రై అయినట్టు, ముడతలు పడినట్టు కనిపించకుండా ఉండాలంటే, స్కిన్ సాఫ్ట్ గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఈ ఉండడం కూడా ఎంతో అవసరం. అందుకే విటమిన్ ఈ ఉన్న ఆహార పదార్థాలను కూడా ఆహారలో భాగంగా చేసుకుంటే చర్మం ఆరోగ్యాన్ని, అందాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా పిస్తా, బాదం ,అక్రోట్, పల్లీలు వంటి నట్స్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు మనం మొలకలను ఆహారంగా తీసుకుంటే కూడా విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.

చర్మం మృదువుగా ఉండాలంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం అవసరం
చర్మంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తగ్గితే చర్మం వయసు పెద్దగా కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఎప్పటికప్పుడు మన ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ లతోపాటు ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ను ఇచ్చే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. చర్మం మృదువుగా అవుతుంది. తీసుకోవలసిన ఆహారాన్ని సరిగ్గా తీసుకోకుండా, బయట ఎన్ని పూతలు పూసినప్పటికీ చర్మ ఆరోగ్యం మెరుగు పడదు. అందుకే కచ్చితంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఎక్కువగా ఉంటే పౌష్టికాహారాన్ని దైనందిన జీవితంలో ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.