Health
oi-Garikapati Rajesh
జుట్టు సమస్యలను తగ్గించేందుకు ఉసిరికాయ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. పొడి జట్టుకు కండిషనర్ లా ఉసిరి పొడి ఉపయోగపడుతుంది. దీనివల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలన్నింటినీ ఉసిరి పొడి నివారిస్తుంది.
ఒక గిన్నెలోకి మెంతి పొడిని, దీనికి సమానంగా ఉసిరికాయ పొడిని తీసుకోవాలి. నీళ్లు మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరిపొడితో శీకాకాయ పొడిని కలిపి పేస్ట్ లాగా చేసి జుట్టుకు పెట్టుకోవాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు సమస్యలన్నీ తొలగుతాయి. జుట్టు మృదువుగా మారడంతోపాటు పొడవు పెరుగుతుంది.

ఉసిరికాయ పొడిని నీటిలో వేసి 5 నిమిషాలు వేడి చేయాలి. ఇది ఆరిపోయిన తర్వాత అందులో నిమ్మరసం కలుపుకొని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత.. రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. పోషకాహారం కూడా తప్పనిసరిగా తీసుకుంటుండాలి. దీర్ఘకాలం ఒత్తిడిని ఎదుర్కొన్నవారు నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడంలాంటి సమస్యలకు గురవుతారు. ఆ ప్రభావం జుట్టుపై కూడా పడి రాలిపోతుంటుంది. తర్వాత వెంట్రుకలు తెల్లబడతాయి. ఒత్తిడి లేకుడా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు ధ్యానం చేయడంతోపాటు నిద్ర పోవాలి. రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు ప్రారంభమవుతాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, తర్వాత జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. తర్వాత నల్లజుట్టు తెల్లగా మారుతుంది. సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం.
English summary
Amla is very beneficial for reducing hair problems.
Story first published: Monday, April 3, 2023, 18:43 [IST]