Health
oi-Garikapati Rajesh
ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలు రావడం సర్వసాధరణంగా మారిపోయాయి. తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలను అనేకమంది ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలవల్ల సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి చిట్కాలను పాటించాలో తెలుసుకుందాం.
* రెండు టీస్పూన్ల హెన్నా పౌడర్, ఉసిరి పొడి, రెండు టీస్పూన్ల పెరుగు, ఒక గుడ్డు, అర టీస్పూన్ కొబ్బరి నూనె, షికాకాయ్, ఒక టీస్పూన్ నిమ్మరసంను మిక్స్ చేసి మిశ్రంగా తయారు చేయాలి. ఇలా చేసిన పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. దీనివల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలగడమేకాక దృఢంగా తయారవుతుంది. జుట్టు రాలడం.. ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.

* ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీన్ని జుట్టుకు అప్లై చేసి 30 నుంచి 40 నిముషాల తర్వత జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు దృఢంగా నల్లగా తయారవుతుంది. వేగంగా రాలుతున్న జుట్టు తగ్గిస్తుంది.
* నువ్వులు తినడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. నువ్వుల నూనెను జుట్టుకు రాయడంవల్ల సులభంగా జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
* జుట్టును ఒత్తుగా దృఢంగా తయారు చేయడానికి బృంగరాజ్, అశ్వగంధ మూలికలు బాగా ఉపయోగపడతాయి. . ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు నుంచి రక్షిస్తాయి. కాబట్టి తెల్ల జుట్టు, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మూలికలను వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
English summary
Experts suggest that you can easily turn white hair into black with some tips.
Story first published: Saturday, April 1, 2023, 14:38 [IST]