Health
oi-Garikapati Rajesh
కాలానికి అనుగుణంగా జీవనశైలి మారుతుండటంతో తక్కువ వయసులోనే చాలామంది మధుమేహానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అనారోగ్యాన్ని కల్పించే ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుత సీజన్ లో లభించే నేరేడు పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు. నేరేడు పండువల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నేరేడు పండ్లలో పీచు, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు లాభిస్తాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు నేరేడును ప్రతిరోజు తింటుండటంవల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

నేరేడు పండ్ల సలాడ్:
ఫ్రూట్ సలాడ్ తినాలనుకునే వారు నేరేడు పండ్లతో తయారు చేసిన సలాడ్ తినడంవల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలోకి వస్తాయి.
నేరేడు పండ్ల ఫిజ్:
ఫిజ్ తయారు చేయడానికి ముందుగా… నిమ్మకాయ సోడాను గ్లాసులోకి పోసుకోవాలి. అందులో నేరేడు పండ్ల గుజ్జును వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఇలా తయారు చేసిన ఫిజ్‌ను తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
నేరేడు పండ్ల హల్వా:
నేరేడు పండ్ల హల్వా తయారు చేయడానికి ముందుగా ఆ పండ్ల నుంచి గుజ్జును తీయాలి. దాన్ని ఒక బౌల్‌లో వేసి అందులో తేనె, చియా గింజలను మిక్స్ చేసి హల్వాను సిద్ధం చేసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
నేరేడు పండ్ల రసం:
జామున్ రసం గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ పండు తీసివేసి, విత్తనాలను వేరు చేసి.. గుజ్జును బ్లైడర్‌లో వేసి.. అందులో బ్లాక్ సాల్ట్, తేనె కలిపి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ప్రతి రోజూ తీసుకోవడంవల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
English summary
As the lifestyle changes with the times, many people are losing their lives due to diabetes at a young age.
Story first published: Sunday, April 2, 2023, 9:35 [IST]