నిత్య జీవితంలో నీటికి ఉన్న ప్రాధాన్యత దేనికీ ఉండదు. అందుకే ఇది పంచభూతాల్లో ఒకటైంది. నీటికి సంబంధించి ప్రతిరోజు మనం చాలావార్తలు తెలుసుకుంటూనే ఉంటాం. గుక్కెడు నీటికోసం ఎదురుచూసే ప్రాంతాలు మనదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అంతేకాదు.. కిలోమీటర్ల తరబడి నడిచివెళ్లి బిందెడు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దుర్వినియోగమయ్యేచోట నీరు వృథాగా పోతూనే ఉంటుంది.