11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం- సభలో 32కు పెరిగిన మెజార్టీ : ఎవరి బలం ఎంత..!!

ఏపీ శాసనసభలో పూర్తి మెజార్టీతో ఉన్న అధికార వైసీపీ..ఇప్పుడు శాసనమండలిలోనూ అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 151 మంది వైసీపీకి ఉండగా… టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే సైతం అదే బాటలో ఉన్నారు. ఇక, శాసన మండలిలో ఇప్పటి వరకు మెజార్టీతో ఉన్న