క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా?

గోడ దూకి మరీ..

గోడ దూకి మరీ..

న్యూఢిల్లీ జోర్ బాగ్‌లోని చిదంబరం ఇంటికి గేట్లు మూసివేసి ఉంచడంతో సీబీఐ అధికారులు లోపలికి వెళ్లలేకపోయారు. అయితే, ఇద్దరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారులు మాత్రం వాటిని అధిగమించి లోపలికి వెళ్లారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు సీబీఐ విచారణాధికారి ఆర్. పార్థసారథి చిదంబరం నివాసంలోకి ప్రహారీ గోడదూకి ప్రవేశించారు.

మరో అధికారి కూడా గోడ దూకి లోపలికి వెళ్లారు.

20 కీలక ప్రశ్నలు.. చెప్పలేను, స్పష్టంగా తెలియదు.. సీబీఐకి చిదంబరం సమాధానాలు..!

కీలకంగా పార్థసారథి..

కీలకంగా పార్థసారథి..

ఆ తర్వాత అరగంటకు చిదంబరంను అదుపులోకి తీసుకుని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ నాటి నుంచి కూడా సీబీఐ అధికారి పార్థసారథి ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

లోతుగా విచారణ..

లోతుగా విచారణ..

2018, ఏప్రిల్‌లో కార్తీ చిదంబరంను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కార్తీ చిదంబరంకు సీబీఐ కస్టడీతోపాటు జుడీషియల్ కస్టడీని కూడా విధించింది ఈ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన పార్థసారథి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ వ్యవహరాలను లోతుగా గమనిస్తున్నారు.

క్వైట్ అండ్ డిటర్మైన్డ్ ఆఫీసర్..

క్వైట్ అండ్ డిటర్మైన్డ్ ఆఫీసర్..

మారిషస్‌కు చెందిన కంపెనీలు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో రూ. 305 కోట్ల రూపాయల విదేశీ పెట్టబడులు పెట్టిన వ్యవహారంలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం 2007లో జరగ్గా 2008లో ఆర్థికమంత్రిత్వశాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దీన్ని బయటికి తీసింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ నుంచి సరైన అనుమతులు లేకుండా రూ. 305కోట్ల విదేశీ పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి వచ్చినట్లు ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ వెల్లడించింది. 2017 మే 15న సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఆ నాటి నుంచి సీబీఐ అధికారి పార్థసారథి ఈ కేసులో కీలకంగా వహరిస్తున్నారు. పార్థసారథి చాలా సిన్సియర్, నిర్ణయాత్మక అధికారి(క్వైట్, డిటర్మైన్డ్ ఆఫీసర్) అని మాజీ అధికారులు చెబుతుండటం గమనార్హం. ఐఎన్ఎక్స్ మీడియా కేసును ఆయనే ఓ కొలిక్కి తెస్తారని వారు అభిప్రాయపడ్డారు.