Health
oi-Garikapati Rajesh
ఈ
రోజుల్లో
దాదాపు
అందరి
ఇళ్లల్లో
ఏసీ
ఉంటోంది.
ఎండ
వేడి
నుంచి
రక్షించుకునేందు
ఏసీలో
గడపడం
సహజం.
అయితే
చాలామంది
రోజు
మొత్తం
ఏసీలోనే
గడుపుతారు.
కొద్ది
సమయం
వేడిని
ఎదుర్కోవాల్సి
వచ్చినా
ఇబ్బంది
పడిపోతారు.
రోజంతా
ఏసీలో
ఉండటంవల్ల
అనేక
సమస్యలు
తలెత్తుతాయి.
వాటిగురించి
తెలుసుకుందాం.
*
ఏసీలో
ఎక్కువ
సమయం
ఉండటంవల్ల
శ్వాసకోశ
సమస్యలు
ఎదురవుతాయి.
ముక్కు,
గొంతు
సమస్యలు
తలెత్తుతాయి.
ఎయిర్
కండిషనింగ్
పొడిగా
ఉండటంతో
గొంతులో
కూడా
పొడిగా
ఉండి
చికాకును
కలిగిస్తుంది.

*
అధిక
సమయం
ఏసీలో
గడిపేవారు
ఊరికే
అలసిపోతారు.
బలహీనంగా
ఉంటారు.
పదే
పదే
నీరసానికి
గురవుతుంటారు.
వీటిని
నివారించాలంటే
ఏసీని
తక్కువ
చల్లనంలో
ఉపయోగించుకుంటే
మంచిది.
*
అలాగే
ఎక్కువ
సమయం
ఏసీలో
ఉండేవారికి
తలనొప్పి
వస్తుంది.
గది
వాతావరణం
ఏసీ
వల్ల
పొడిగా
ఉంటుంది.
దీనివల్ల
డీ
హైడ్రేషన్
కు
గురై
బయటకు
వెళ్లినప్పుడు
తలనొప్పి
సమస్యను
ఎదుర్కొంటుంటారు.
*
ఏసీలో
ఎక్కువ
సేపు
ఉండటంవల్ల
చర్మంపై
దుష్ప్రభావం
పడుతుంది.
పొడిగా
మారడం,
దురద
అనిపించడంతో
చికాకును
కలిగిస్తుంది.
ఇలాంటి
సమయంలోనే
కొన్ని
జాగ్రత్తలు
తీసుకోవాల్సి
ఉంటుంది.
*
సహజమైన
గాలి,
వెలుతురు
ఉన్న
భవానాల్లో
పనిచేసేవారికి,
ఏసీ
భవనాల్లో
పనిచేసేవారికి
వారికి
చాలా
తేడా
ఉంటుంది.
వీరికి
తరుచుగా
ముక్కు
కారుతుండటం,
శ్వాస
తీసుకోవడంలో
ఇబ్బందులు
తలెత్తడం
లాంటివి
ఉంటాయి.
*
రోజు
మొత్తం
మీద
కేవలం
20
నుంచి
30
నిముషాల
సమయమే
ఏసీలో
ఉండాలి
English summary
Staying in AC all day can cause many problems.
Story first published: Monday, May 22, 2023, 13:26 [IST]