• Wed. Sep 28th, 2022

24×7 Live News

Apdin News

congress paycm: బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్ల కలకలం: సీఎం లక్ష్యంగా కాంగ్రెస్, తొలగింపు

Byadmin

Sep 21, 2022


Bengaluru

oi-Rajashekhar Garrepally

|

Google Oneindia TeluguNews

బెంగళూరు:కర్ణాటక
ముఖ్యమంత్రి
బసవరాజ్
బొమ్మైని
లక్ష్యంగా
చేసుకుని
కాంగ్రెస్
వినూత్న
రీతిలో
విమర్శలు
ఎక్కుపెట్టింది.
ప్రముఖ
డిజిటల్​
చెల్లింపుల
సంస్థ
పేటీఎం
తరహాలో
PayCM
అంటూ
పోస్టర్లు
బుధవారం
బెంగళూరు
నగరంలోని
పలు
ప్రాంతాల్లో
అంటించింది.


పోస్టర్లు
ఎలక్ట్రానిక్
వాలెట్
Paytm
ప్రకటనల
మాదిరిగానే
ఉన్నాయి.
QR
కోడ్
మధ్యలో
“40
%
ఇక్కడ
అంగీకరించబడింది’
అనే
సందేశంతో
బసవరాజ్
బొమ్మై
ముఖ
చిత్రం
ఉంచారు.

Congress targets CM Bommai: PayCM Posters In Bengaluru Over Corruption.

ప్రభుత్వ
కాంట్రాక్టులు,
ప్రభుత్వ
ఉద్యోగాల
నియామకాలలో
అవినీతికి
పాల్పడ్డారని
ఆరోపించిన
కాంగ్రెస్..
రాష్ట్ర
ప్రభుత్వానికి
వ్యతిరేకంగా
దూకుడుగా
ప్రచారం
చేస్తున్న
నేపథ్యంలో

పరిణామం
జరిగింది.
బొమ్మై
ప్రభుత్వం
40
శాతం
కమీషన్లు
తీసుకుంటుందంటూ
కాంగ్రెస్
నేతలు
ఆరోపణలు
చేస్తున్న
విషయం
తెలిసిందే.

కాగా,
పోస్టర్లకు
సంబంధించిన
ఫొటోలు,
వీడియోలు
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యాయి.

విషయం
అధికారుల
దృష్టికి
వచ్చిన
వెంటనే
బహిరంగ
ప్రదేశాల్లో
ఉన్న

పోస్టర్లను
తొలగించారు.

పేసీఎం
పోస్టర్ల
వ్యవహారంపై
పోలీసు
శాఖ
స్పందించింది.
వాటిని
అంటించినందుకు
గుర్తు
తెలియని
వ్యక్తులపై
కేసు
నమోదు
చేసినట్లు
బెంగళూరు
నగర
పోలీస్
కమిషనర్
ప్రతాప్
రెడ్డి
తెలిపారు.

English summary

Congress targets CM Bommai: “PayCM” Posters In Bengaluru Over Corruption.

Story first published: Wednesday, September 21, 2022, 18:04 [IST]