భోజన ప్రియులు ఎక్కువమంది మధ్యాహ్నం లంచ్ కంటే రాత్రి డిన్నర్ ని ఇష్టపడతారు. కానీ రాత్రిపూట తినే భోజనం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తినే ఆహారం కావొచ్చు.. తినే టైం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే రాత్రిపూట సరైన సమయంలో.. సరైన ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.