
అరటి పండు
రాత్రిపూట అరటిపండు తినకుండా ఉండాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట అరటిపండు తినడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి పూట ఆహారం తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందట. రోజూ ఒక యాపిల్ ఖచ్చితంగా తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. యాపిల్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే యాపిల్ రాత్రిపూట తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట.

యాపిల్
రాత్రి పూట యాపిల్ తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదట. రాత్రి పూట యాపిల్ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట. సపోటాల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రిపూట తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయట. రాత్రిపూట సిట్రస్ పండ్లను తీసుకోవడం మంచిది కాదట.

నారింజ, ద్రాక్ష
నారింజ, ద్రాక్షలో కూడా ఆమ్ల పదార్థాలు ఉంటాయి. అందుకే వీటిని తినకూడదట. ఎందుకంటే వీటిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందట.బత్తాయిలను కూడా రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే ఆమ్ల పదార్థాలు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దీనివల్ల రాత్రిళ్లు అస్సలు నిద్ర రాదట.