మనకు ఎక్కువగా దొరికే పండ్లలో జామకాయ ఒకటి. ఈ జామ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఈ జామ యాపిల్ తో సమానమైందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ జామకాయలో ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఈ పండును పేదవాడి ఆపిల్ పండు అని పిలుస్తుంటారు. ఈ పండును నేరుగా తిన్నా, జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుంది.