మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం సరిగ్గా ఉండాలి. మానవ జీవితానికి ముఖ్య జీవనాధారం అయిన నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన ఆహారం తీసుకోవడంతోపాటు నిత్యం మనం తాగే నీళ్ళ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కావాల్సిన నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే శరీరం అనారోగ్యం పాలవుతుంది. నీళ్ళే కదా అని నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది.