Health
oi-Dr Veena Srinivas
ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. బిపి, డయాబెటిస్, గుండె జబ్బులు ఇటువంటి అనేక సమస్యలకు మూల కారణమే ఊబకాయం.ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు, శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.
చాలామంది విపరీతంగా బరువు పెరిగాం అని, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉందని తెగ బాధ పడుతూ ఉంటారు. ఎన్ని డైట్స్ ఫాలో చేసినా, నిత్య వ్యాయామం చేసినా, జిమ్ లకు వెళ్ళి ఏరోబిక్స్ చేసినా ఫలితం ఉండడం లేదని దిగులు పడుతూ ఉంటారు. కనీసం నెలకు రెండు మూడు కిలోల బరువు తగ్గలేదని, బరువు తగ్గే మార్గం గురించి తెగ ఆలోచిస్తుంటారు.

ఇక అలాంటి వారు బరువు తగ్గాలంటే ప్రతిరోజు భోజనంలో ఒక ఆహారాన్ని తింటే సరిపోతుందని చెబుతున్నారు నేచురోపతి వైద్యులు. అయితే ఊబకాయం తగ్గడానికి, శరీరంలో ఉన్న కొవ్వు ఐస్ మాదిరిగా కరిగిపోవడానికి ఒక ఆహారం తింటే మంచి ఫలితం ఉంటుందని నేచురోపతి వైద్యులు చెబుతున్నారు.
ప్రతిరోజు మనం భోజనం చేసే సమయంలో ఒక నియమాన్ని తు.చ తప్పకుండా పాటిస్తే, ఒక ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తోడినట్లు పోతుందని చెబుతున్నారు. ప్రతిరోజు మనం భోజనం చేసే సమయంలో కేవలం ఆకుకూరలు, కూరగాయలతో వండిన కూరలు తింటే త్వరితగతిన బరువు తగ్గుతామని చెబుతున్నారు.
అన్నం, రోటీలు, తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారం కానీ తీసుకోకుండా కేవలం ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసిన రెండు రకాల కూరలను తింటే శరీరంలో ఉన్న కొవ్వు తొందరగా తగ్గుతుందని చెబుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలలో కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ శాతం ఉంటాయని, శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా ఉంటాయని చెప్తున్నారు.
అందుకే వాటిని మాత్రమే భోజనం లో భాగంగా చేసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలి అనుకునేవారికి మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు. ఖచ్చితంగా రెండు, మూడు నెలలు ఈ డైట్ ను కఠినంగా ఫాలో అయితే ఆశించిన మేరకు ఫలితం వస్తుందని, స్లిమ్ గా మారడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటామని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
English summary
Naturopathic doctors say that if you want to melt the fat around the stomach like an ice, if you eat only vegetables curries every day, the fat will melt.
Story first published: Friday, May 19, 2023, 14:19 [IST]