Health
oi-Dr Veena Srinivas
ఇప్పుడు
చాలామంది
చెడు
కొలెస్ట్రాల్
కారణంగా
అనేక
అనారోగ్య
సమస్యలను
ఎదుర్కొంటున్నారు.
ఏది
పడితే
అది
తినడం,
శారీరక
వ్యాయామం
లేకపోవడం,
తీసుకునే
ఆహారాలు
చెడు
కొవ్వును
పెంచే
ఆహారాలని
తీసుకోవడం
వంటి
అనేక
కారణాలు
శరీరంలో
చెడు
కొలెస్ట్రాల్
ను
పెంచుతున్నాయి.
శరీరంలో
ఉండవలసిన
మంచి
కొలెస్ట్రాల్
తగ్గిపోయి,
ఉండకూడని
చెడు
కొలెస్ట్రాల్
పెరిగిపోతుంది.
మన
శరీరంలో
హెచ్
డి
ఎల్
మంచి
కొలెస్ట్రాల్
గాను,
ఎల్డిఎల్
చెడు
కొలెస్ట్రాల్
గాను
ఉంటుంది.
చెడు
కొలెస్ట్రాల్
ఎక్కువగా
ఉన్నప్పుడు
అనేక
అనారోగ్య
సమస్యలను,
గుండె
జబ్బులను
ఎదుర్కోవలసి
వస్తుంది.
అంతేకాదు
రక్తంలోనూ
కొవ్వు
చేరి
ట్రై
గ్లిజరైడ్స్
పెరుగుతాయి.
ఈ
ట్రై
గ్లిజరైడ్స్
వల్ల
అనేక
అనారోగ్య
సమస్యలు
వస్తాయి.
కాబట్టి
ఆరోగ్యంగా
ఉండాలి
అనుకునేవారు
శరీరంలోని
చెడు
కొలెస్ట్రాల్
ను
తగ్గించుకోవాల్సిన
అవసరం
ఉంది.

ఆహారంలో
మార్పులు
చేయడం
వల్ల
శరీరంలో
చెడు
కొలెస్ట్రాల్
ను
తగ్గించుకోవచ్చు.
తాజా
పండ్లు,
కూరగాయలు,
తృణధాన్యాలు,
శరీరానికి
కావలసిన
ఆరోగ్యకరమైన
కొవ్వులను
పెంచి
అనారోగ్యకరమైన
కొవ్వును
తగ్గిస్తాయి.
చెడు
కొలెస్ట్రాల్
ను
శరీరంలో
తగ్గించుకోవాలనుకునేవారు
అల్పాహారంగా
ఓట్
మీల్
తీసుకోవడం
మంచిదని
చెబుతున్నారు.
అంతేకాదు
చెడు
కొలెస్ట్రాల్
తగ్గాలంటే
బీన్స్
ను
తరచూ
ఆహారంలో
తీసుకోవాలని,
బీన్స్
లో
ఫైబర్
పుష్కలంగా
ఉండటం
వల్ల
అవి
తీసుకున్న
తర్వాత
జీర్ణం
కావడానికి
శరీరం
ఎక్కువ
సమయం
తీసుకుంటుందని,
భోజనం
చేసిన
తర్వాత
ఎక్కువసేపు
కడుపు
నిండిన
ఫీలింగ్
ఉంటుందని
చెబుతున్నారు.
బాదం,
వాల్
నట్స్,
వేరుశనగ
గింజలు,
ఇతర
తృణధాన్యాలు
తినడం
వల్ల
శరీరంలో
చెడు
కొలెస్ట్రాల్
తగ్గుతుందని
అంటున్నారు.

ఇక
ఆకుకూరలను
తీసుకోవడం
కూడా
చెడు
కొవ్వును
తగ్గిస్తుందని
చెబుతున్నారు
.
వారానికి
రెండు
లేదా
మూడు
సార్లు
చేపలు
తినడం
వల్ల
ఎల్డీఎల్
కొలెస్ట్రాల్
తగ్గుతుందని,
ఎల్డీఎల్
కొలెస్ట్రాల్
ను
తగ్గించే
ఒమేగా
త్రీ
కొవ్వులను
చేపలు
కలిగి
ఉంటాయని
చెబుతున్నారు.
ఒమేగా
త్రీ
ఉన్న
చేపలను
తినడం
వల్ల
ట్రై
గ్లిజరైడ్స్
కూడా
తగ్గుతాయని
చెబుతున్నారు.
disclaimer:
ఈ
కథనం
వైద్య
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
English summary
To reduce bad cholesterol, you need to change your diet. Learn about foods that lower bad cholesterol here.
Story first published: Friday, April 14, 2023, 18:11 [IST]