Health
oi-Dr Veena Srinivas
ఉల్లిపాయలలో
అనేక
ఆరోగ్యానికి
మేలు
చేసే
సుగుణాలు
ఉన్నాయి.అందుకే
ఉల్లి
చేసిన
మేలు
తల్లి
కూడా
చేయదని
చాలా
మంది
చెబుతూ
ఉంటారు.
ప్రతి
రోజూ
మనం
తీసుకునే
ఆహారంలో
ఉల్లిపాయలను
ఒక
భాగం
చేసుకొని
తీసుకుంటూ
ఉంటాం.
అయితే
పచ్చి
ఉల్లిపాయలను
మన
ఆహారంలో
భాగం
చేసుకోవడం
వల్ల
అనేక
ఆరోగ్య
ప్రయోజనాలు
ఉన్నాయని
తెలుసుకోవాల్సిన
అవసరం
ఉంది.
పచ్చి
ఉల్లిపాయలను
తినేవారిలో
డయాబెటిస్
వచ్చే
అవకాశాలు
తక్కువగా
ఉంటాయని,
పచ్చి
ఉల్లిపాయలను
తీసుకోవడం
క్యాన్సర్
వంటి
సమస్యలను
రాకుండా
చేస్తుంది
అని
చెబుతున్నారు.
శరీరంలో
వ్యాధి
నిరోధక
శక్తిని
పెంచడానికి,
జ్వరంతోపాటు
దగ్గును
తగ్గించడానికి
ఉల్లిపాయలు
ఉపయోగపడతాయని
చెబుతున్నారు.
ఉల్లిపాయల్లో
ఫైబర్,
విటమిన్
బి,
విటమిన్
బీ
సిక్స్,
విటమిన్
బీ
నైన్,
ఖనిజ
లవణాలు
ఎన్నో
ఉంటాయని
చెబుతున్నారు.

ఇక
అటువంటి
ఉల్లిపాయలను
మనం
కూరలలో
వండుకుని
తినడమే
కాకుండా,
పచ్చి
వాటిని
కూడా
తీసుకోవడం
మంచిదని,
ఉల్లిపాయలలో
కొలెస్ట్రాల్‌ను
తగ్గించే
గొప్ప
గుణం
ఉంటుందని
చెబుతున్నారు.ఉల్లిపాయలు
మన
శరీరంలో
ఉన్న
చెడు
కొలెస్ట్రాల్
ను
తగ్గించి,
మంచి
కొలెస్ట్రాల్
పెరగడానికి
ఎంతో
దోహదం
చేస్తాయని
చెబుతున్నారు.
శరీరంలో
ఉండే
అనేక
అనారోగ్య
సమస్యల
నుంచి
మనల్ని
కాపాడటానికి
ఉల్లిపాయలు
ఎంతగానో
ఉపయోగపడతాయని
అంటున్నారు.
ప్రతి
రోజూ
ఉల్లిపాయలను
తీసుకోవడం
వల్ల
జీర్ణ
సమస్యలు
తగ్గుతాయని
ఉల్లిపాయలో
ఉండే
యాంటీ
బ్యాక్టీరియల్
గుణాలు
వ్యాధులకు
వ్యతిరేకంగా
పోరాటంలో
ఎంతగానో
ఉపయోగపడతాయని
చెబుతున్నారు.
అయితే
నిత్యం
ఉల్లిపాయలను
తిన్నప్పటికీ
వాటిని
మితంగానే
ఆహారంలో
భాగంగా
చేసుకోవాలని,
మంచి
ఆరోగ్య
ఫలితాలుంటాయని
అతిగా
తింటే
అనర్థాలు
వస్తాయని
కూడా
చెబుతున్నారు.
అతిగా
ఉల్లిపాయలను
తింటే
కొన్ని
రకాల
అలెర్జీలు
వచ్చే
అవకాశం
ఉందని
అంటున్నారు.
అందుకే
ఎలాంటి
రోగాలు
లేని
వారికి
నిత్యం
కొద్ది
మోతాదులో
పచ్చి
ఉల్లిపాయలను
తీసుకోవటం
దివ్యౌషధంగా
పని
చేస్తుంది.
ఇతరత్రా
అనారోగ్య
సమస్యలు
ఉన్నవారు
ఉల్లిపాయల
విషయంలో
కాస్త
జాగ్రత్త!!
English summary
It is said that people who eat raw onions are less likely to get diabetes and consuming raw onions prevents problems like cancer.
Story first published: Wednesday, May 10, 2023, 17:43 [IST]