Health
oi-Dr Veena Srinivas
ఆకులలో
భోజనం
చేయడం
చాలా
మంచిది
.
ఆకులలో
భోజనం
చేయడంవల్ల
ఆరోగ్యంగా
కూడా
ఉంటారని
శాస్త్రాలు
చెబుతున్నాయి.
విస్తరాకులలో,
అరటి
ఆకులో
భోజనం
చేయడం
వల్ల
ఆకలి
పెరుగుతుంది.
ఇటీవల
కాలంలో
ఆకులలో
భోజనం
చేయటం
చాలా
మంది
నామోషీగా
ఫీల్
అవుతున్నారు.
పేపర్
ప్లేట్లలో
భోజనం
చేస్తూ
అరిటాకులలో
భోజనం
చేయటాన్ని
మర్చిపోతున్నారు.
కానీ
ఒకప్పుడు
ఏదైనా
చిన్న
ఫంక్షన్
ఏది
జరిగినా
సరే
అరిటాకులలోనే
చక్కగా
భోజనం
పెట్టేవారు.
ఆరోగ్య
శాస్త్రాలు,
పురాతన
శాస్త్రాలు
భోజనం
అరిటాకులోనే
చేయడం
మంచిదని
పేర్కొన్నాయి.
అరిటాకు
మాత్రమే
కాదు,
మోదుగ,బాదం,
టేకు
ఇలా
ఏ
ఆకు
అయినా
సరే
భోజనానికి
మంచిదే
అని
చెప్తున్నారు.
ఆకులలో
ఉండే
ఔషధ
గుణాలు
శరీరానికి
ఎంతో
మేలు
చేస్తాయని
చెబుతారు.

ఏ
ఆకులో
భోజనం
చేస్తే
ఎటువంటి
ఆరోగ్య
ప్రయోజనాలు
కలుగుతాయో
ప్రస్తుతం
మనం
తెలుసుకుందాం.
రావి
ఆకులో
భోజనం
చేస్తే
జననేంద్రియ
దోషాలు
తొలగిపోతాయి.
చిన్న
పిల్లలకు
చక్కని
మాటలు
వస్తాయి.
ఇక
మోదుగ
ఆకుల
విస్తరిలో
భోజనం
చేస్తే
నేత్ర
దోషాలు
తొలగిపోతాయి.
టేకు
ఆకులో
భోజనం
చేయడం
వల్ల
భవిష్యత్,
వర్తమానాలు
తెలుసుకోగలిగే
జ్ఞానం
వస్తుంది.
తామరాకులో
భోజనం
చేయడం
వల్ల
ఐశ్వర్యం
కలిగి
సాక్షాత్తు
లక్ష్మీదేవి
కటాక్షం
కలుగుతుంది.
బాదం
ఆకులో
భోజనం
చేయడం
వల్ల
మంచి
దృఢమైన
చిత్రం
కలిగిన
వారై
ఉంటారు.
ఇక
మర్రి
ఆకులతో
కుట్టిన
విస్తరిలో
భోజనం
చేస్తే
సంపూర్ణ
ఆరోగ్యవంతులుగా
ఉంటారని
చెబుతున్నారు.
జమ్మి
ఆకు
విస్తరిలో
భోజనం
చేస్తే
లోకాన్ని
జయించే
శక్తి
సంపాదించవచ్చని
జ్ఞానులు
చెబుతున్నారు.
పచ్చటి
ఆకులో
భోజనం
చేయడం
వల్ల
ఆకులలో
ఉండే
క్లోరోఫిల్
మన
శరీరంలోని
అనేక
రుగ్మతలను,
పేగుల్లో
ఉండే
రకరకాల
అనారోగ్యాన్ని
కలిగించే
క్రిములను
నాశనం
చేయడంలో
ఎంతగానో
ఉపయోగపడుతుంది.
అందుకే
ఆకులలో
భోజనం
చేయడం
అన్ని
విధాల
శ్రేయస్కరం
అని
చెప్పబడింది.
disclaimer:
ఈ
కథనం
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.
English summary
Eating in the leaves is very good. Science says that eating in the leaves will also keep you healthy. In general, eating in banana leaves has many health benefits.
Story first published: Tuesday, May 16, 2023, 20:03 [IST]