• Sun. Apr 2nd, 2023

24×7 Live News

Apdin News

health tips: కొబ్బరినూనెతో ఊబకాయానికి చెక్.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!! | health tips: Check for obesity with coconut oil.. These are the amazing benefits!!

Byadmin

Mar 29, 2023


ఎన్నో రోగాలను నయం చేసే గొప్ప గుణాలున్న నూనె కొబ్బరి నూనె

ఎన్నో రోగాలను నయం చేసే గొప్ప గుణాలున్న నూనె కొబ్బరి నూనె

అయితే మనకందరికీ ఈజీగా దొరికే, ప్రతి ఒకరి ఇంట్లోను కచ్చితంగా ఉండే కొబ్బరి నూనె చాలా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తుంది. కొబ్బరినూనె మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన వర ప్రదాయిని. కొబ్బరినూనె ఎన్నో రోగాలను నయం చేసే గొప్ప గుణాలున్న నూనె. మన శరీరంలో వాపులు, నొప్పులు తగ్గడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, ఊబకాయం బాధితులకు కొబ్బరి నూనె ఒక దివ్య ఔషధం అని చెప్పాలి.

ఉదయం పూట రెండు స్పూన్ల కొబ్బరి నూనె తాగితే జరిగేదిదే

ఉదయం పూట రెండు స్పూన్ల కొబ్బరి నూనె తాగితే జరిగేదిదే

ఇక కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఎలా ఉపయోగించినా మెరుగైన ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట రెండు స్పూన్ల కొబ్బరి నూనె తాగితే అనేక అనారోగ్య సమస్యలు మటుమాయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ఒక స్పూన్ కొబ్బరి నూనెను మనం వండుకునే అన్నంలో వేసి వండుకున్నట్లయితే కొబ్బరి నూనెలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు మనం అన్నం తిన్న సమయంలో మన ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

బరువు తగ్గించటంలో కొబ్బరినూనె ఎలా పని చేస్తుందంటే

బరువు తగ్గించటంలో కొబ్బరినూనె ఎలా పని చేస్తుందంటే

ప్రతిరోజు మన ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలను కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి వంట చేసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. అంతే కాదు కొద్దిగా తేనె, కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయని శరీర బరువు తగ్గించడంలో కొబ్బరి నూనె ఎంతగానో దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఇక కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి వాపులు, నొప్పులు ఉన్నచోట రాసి మర్దన చేసినట్లయితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని కూడా చెబుతున్నారు.

చర్మ సౌందర్యానికి కొబ్బరినూనె

చర్మ సౌందర్యానికి కొబ్బరినూనె

కొబ్బరి నూనె తలకి రాసుకుని మర్దన చేసుకోవడం వల్ల శరీర హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుందని, మానసిక ఇబ్బందులు తగ్గి ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. మన జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో కూడా కొబ్బరి నూనె దోహదం చేస్తుందని అంటున్నారు. కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి మేలు చేస్తుందని, కొబ్బరి నూనె పెదాలకు లిప్ బామ్ లాగా పనిచేస్తుందని, కొబ్బరి నూనె కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

చర్మానికి మాయిశ్చరైజర్ లా..

చర్మానికి మాయిశ్చరైజర్ లా..

కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం పొడిబారకుండా కాపాడతాయని, మంచి మాయిశ్చరైజర్ లా పని చేస్తుందని అంటున్నారు. చుండ్రు, జుట్టు పొడి బారటం వంటి సమస్యలను కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుందని అంటున్నారు. కొబ్బరినూనెలో ఉండే శరీరానికి మేలు చేసే గుణాలు అన్నీ ఇన్నీ కావని, ప్రతీ రోజు కొబ్బరి నూనె వినియోగంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: ఈ డైట్ ప్లాన్‌తో వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు.. ట్రై చెయ్యండి!!health tips: ఈ డైట్ ప్లాన్‌తో వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు.. ట్రై చెయ్యండి!!