• Tue. Jun 6th, 2023

24×7 Live News

Apdin News

health tips: కోడిగుడ్లకు ఎక్స్‌పైరీ డేట్; గుడ్లు పాడైపోయాయని గుర్తించటానికి సింపుల్ చిట్కా!! | eggs also have an expiry date; Simple tips to identify spoiled eggs!!

Byadmin

Jun 5, 2023


Health

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

మనం
తీసుకునే
ఆహారంలో
ప్రతి
పదార్థం
కొంతకాలం
మాత్రమే
తాజాగా
ఉంటుంది.
ప్రతి
పదార్థానికి
ఎక్స్‌పైరీ
డేట్
ఉంటుంది.
అలాగే
మనం
తినే
కోడిగుడ్లకు
కూడా
ఎక్స్‌పైరీ
డేట్
ఉంటుంది.
కోడిగుడ్ల
గడువు
ముగిసిన
తర్వాత
వాటిని
గుర్తించటం
ఎలా?
అవి
ఎక్స్పైర్
అయ్యాయని
తెలుసుకోవడం
ఎలా
అన్న
వివరాలు
ప్రస్తుతం
మనం
తెలుసుకుందాం.

కోడిగుడ్లు..
మన
ఆరోగ్యానికి
ఎంతో
మంచిది.
ప్రతిరోజు
ఒక
కోడి
గుడ్డును
తినడం
మన
శరీరానికి
కావలసిన
పోషకాలను
అందిస్తుంది.
ఒక
కోడిగుడ్డులో
సుమారు
6
గ్రాముల
ప్రోటీన్
ఉంటుంది.
కోడిగుడ్లు
కండరాల
బలాన్ని
పెంచుతాయి.
వీటిలో
విటమిన్లు,
ఖలిజలవణాలు
మన
శరీరానికి
కావలసిన
పోషకాలను
అందించి,
శరీరాన్ని
పుష్టిగా
ఉంచేలా
చేస్తాయి.
అయితే
అటువంటి
కోడిగుడ్లకు
కూడా
గడువు
తేదీ
ఉంటుంది.

eggs also have an expiry date; Simple tips to identify spoiled eggs!!

కొన్ని
రోజుల
తర్వాత
గుడ్డు
చెడిపోవడం,
దాని
పోషకాలను
కోల్పోవడం
ప్రారంభమవుతుంది.
అయితే
గుడ్డు
చెడిపోయిందని,
పోషకాలను
కోల్పోతుందని
గుర్తించడం
ఎలా
అన్నది
చాలామందికి
తెలియదు.
గుడ్లు
పొదిగిన
తర్వాత
గది
ఉష్ణోగ్రత
వద్ద
ఉంచినట్లయితే
అవి
10
నుండి
12
రోజులపాటు
తాజాగా
ఉంటాయి.
అయితే
పొదిగిన
తేదీ
గుడ్లను
కొనుగోలు
చేసే
ఎవరికీ
తెలియదు.
కాబట్టి
అవి
ఎన్ని
రోజులు
తాజాగా
ఉంటాయి
అనేది
గుర్తించడం
కష్టం.

ఇక

కోడిగుడ్లను
ఫ్రిజ్లో
ఉంచినట్లయితే
నాలుగు
నుండి
ఐదు
వారాలపాటు
అవి
తాజాగా
తినదగినవిగా
ఉంటాయి.
ఒకవేళ
గుడ్లు
పాడైపోతే,
అది
మనం
తెలుసుకోకుండా
వండుకుని
తింటే
దానివల్ల
అనేక
అనారోగ్య
సమస్యలు
వస్తాయి.
పాడైపోయిన
గుడ్లు
సాల్మొనెల్లా
బ్యాక్టీరియాను
కలిగి
ఉంటాయి.
ఇవి
లూజ్
మోషన్స్,
కడుపునొప్పి,
జ్వరం,
వాంతులు,
చలి,
తలనొప్పి,
రక్త
విరోచనాలు
వంటి
అనేక
అనారోగ్యాలకు
కారణమవుతాయి.

గుడ్డును
ఉడికించిన
తర్వాత,
అది
ఫ్రెష్
గా
ఉందా
లేదా
అనేది
తెలుసుకోవడానికి
మధ్యలో
ఉండే
పచ్చ
సొన
ఉడికి
కనిపిస్తుంది.
అలాకాకుండా
పచ్చ
సొన
ఉడకకుండా
బంక
బంకగా
ఉంటే

గుడ్డు
పాడైపోయినట్టుగా
గుర్తించాలి.
పాడైపోయిన
గుడ్లను
గుర్తించడానికి
ఇక
అన్నిటికంటే
సులభమైన
మార్గం
వాటిని
నీటిలో
వేస్తే
పాడైపోయిన
లేదా,
ఎక్స్పైర్
అయిపోయిన
గుడ్లు
నీళ్ల
పైన
తేలుతాయి.
మిగతా
గుడ్లన్నీ
నీళ్లలో
మునుగుతాయి.
కాబట్టి
గుడ్లు
తినాలనుకునే
వారు
వాటి
తాజాదనాన్ని
కూడా
ఎప్పటికప్పుడు
చెక్
చేసుకుని,
మంచి
కోడిగుడ్లను
ఆహారంగా
తీసుకోండి.


disclaimer
:

కథనం
ఆహార
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

English summary

Every substance has an expiry date. Also the eggs we eat have an expiry date. There are also simple tips to know it.

Story first published: Thursday, April 13, 2023, 21:05 [IST]