• Fri. Jun 9th, 2023

24×7 Live News

Apdin News

health tips: గుడ్డు పచ్చసొనలో రక్తపు చారికలు; అలాంటి గుడ్లు తింటే ప్రమాదమా? | health tips: blood spots in egg yellow yolk; Is it dangerous to eat such eggs!!

Byadmin

Jun 6, 2023


Health

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

చాలామంది
కోడిగుడ్లను
ఇష్టంగా
తింటారు.
మంచి
పోషకాలు
ఉన్న
ఆహారంగా
ప్రతిరోజు
గుడ్లను
తినాలని
చెబుతూ
ఉంటారు.
అయితే
కోడి
గుడ్డుని
తినే
వాళ్లకు
ఎటువంటి
కోడి
గుడ్లను
తినాలి?
ఎలాంటి
వాటిని
తినకూడదు?
అనేది
కూడా
తెలిసి
ఉండాలి.

సాధారణంగా
కోడిగుడ్లలో
తెల్ల
సొన,
పచ్చ
సొన
ఉంటుంది.
కొన్ని
కోడిగుడ్లలో
మాత్రం
గుడ్డు
పగలగొట్టిన
తర్వాత
పచ్చ
సొన
లోపల
రక్తపు
చారికలు
లాగా
కనిపిస్తాయి.
ఇక
అటువంటి
కోడిగుడ్లను
తినొచ్చా?
తినకూడదేమో
అని
చాలామంది
అనుమాన
పడుతూ
ఉంటారు.
ఏదైనా
అనారోగ్య
సమస్య
వస్తుందేమోనని
భయపడుతూ
ఉంటారు.
అయితే
గుడ్డులోని
పచ్చ
సొనలో
ఎర్రటి
రక్తపు
చారికలు
ఉన్నంత
మాత్రాన
అది
శరీరానికి

మాత్రం
హానికరం
కాదు.
అటువంటి
గుడ్లను
సైతం
బాగా
ఉడికించి
తింటే
ఎలాంటి
సమస్య
ఉండదు.
గుడ్డు
లోపల
రక్తపు
చారికలు
ఉండడం
వల్ల
ఎటువంటి
హాని
జరగదు.

health tips: blood spots in egg yellow yolk; Is it dangerous to eat such eggs!!

కానీ
కొన్ని
గుడ్లను
మాత్రం
పొరపాటున
కూడా
తినకూడదు.
కొన్నిసార్లు
గుడ్డులోని
పచ్చ
సొన
లేదా
తెలుగు
భాగం
ఎరుపు
లేదా
గులాబీ
రంగు
లేదా
ఆకుపచ్చ
రంగులోకి
మారితే
ఇటువంటి
గుడ్లను
తినడం
మంచిది
కాదని,
అవి
పాడైపోయిన
గుడ్లుగా
గుర్తించాల్సిన
అవసరం
ఉంది.
టాక్సిక్
బ్యాక్టీరియా
ప్రభావం
కారణంగా
గుడ్డు
లోపల
సొన
రంగు
మారుతుంది.
కొన్ని
గుడ్లు
అయితే
వాసన
కూడా
మారతాయి.
అటువంటి
గుడ్లను
పొరపాటున
కూడా
తినొద్దు.
వాటిని
తింటే
అనవసరమైన
అనారోగ్య
సమస్యలు
వస్తాయి.
కడుపునొప్పి,
వాంతులు,
డయేరియా,
తీవ్రమైన
అజీర్ణం,
సమస్యలు
వచ్చే
ప్రమాదం
ఉంటుంది.

health tips: గుడ్డు తినటం మంచిదే.. కానీ వీళ్ళు తినటం ప్రమాదకరం!!health
tips:
గుడ్డు
తినటం
మంచిదే..
కానీ
వీళ్ళు
తినటం
ప్రమాదకరం!!

ఇక
అంతే
కాదు
కొన్నిసార్లు
గుడ్లు
పగలగొట్టినప్పుడు
గుడ్లలో
చిన్న
చిన్న
మాంసపు
ముద్దలుగా
కనిపిస్తూ
ఉంటుంది.
ఇక
కోడి
ఫెలోపియన్
ట్యూబ్
ద్వారా
గుడ్డు
తయారు
అయ్యే
సమయంలో
కొన్ని
సందర్భాల్లో
ఇలా
జరుగుతుంది.
ఇక
దీని
విషయంలో
కూడా
ఎటువంటి
ఆందోళన
చెందాల్సిన
అవసరం
లేదని
చెప్పొచ్చు.
ఇటువంటి
గుడ్లను
కూడా
బాగా
వండుకొని
తినొచ్చు.
కాబట్టి
గుడ్లను
తినే
విషయంలో
అపోహలు
పక్కనపెట్టి
ఏమి
తినాలి?
ఎలాంటివి
తినకూడదు?
తెలుసుకుంటే
మంచిది.


disclaimer:


కథనం
ఆహార
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

English summary

If there is blood in the egg yolk, is it dangerous to eat such eggs? Which eggs should not be eaten? Everyone should know such things.

Story first published: Tuesday, April 4, 2023, 19:08 [IST]