
బరువు తగ్గాలంటే తెలుసుకోవాల్సిన ప్రాధమిక సూత్రాలు ఇవే
అసలు బరువు తగ్గాలంటే ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలుసుకొని వాటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండటం కోసం మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన ప్రాథమిక సూత్రాలను ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు ముందు బరువు తగ్గడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఉదయం లేవగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి. కనీసం 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు వ్యాయామం కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయాలి. ఇక దీనిని నిత్యం జీవితంలో ఒక భాగం చేసుకోవాలి.

వ్యాయామం , భోజనం విషయంలో జాగ్రత్తలు ఇవే
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామాన్ని ఆపకూడదు. ప్రతిరోజు ఉదయం పది నిమిషాల పాటు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి. స్నానానికి ఎప్పుడూ వేడి నీళ్లనే ఉపయోగించాలి. 9 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అయితే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్ , మొలకలు, వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ లాంటివి బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పండ్లు, కూరగాయలతో పౌష్టికాహారం
ఇక మధ్యాహ్న ఒంటిగంట వరకే లంచ్ చేసేయాలి. లంచ్ లో కూడా ఆకుకూరలు, నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను తినాలి. పౌష్టికాహారం తినాలి. రాత్రి 7 గంటల లోపే డిన్నర్ ముగించేసేయాలి. ఇక బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, స్ట్రాబెరీ, ఆపిల్ వంటి విటమిన్ సి వున్న పండ్లు తీసుకోవాలి. భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే బీరకాయ, సొరకాయ, దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పోషకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.

బరువు ఆరోగ్యంగా తగ్గాలంటే బేసిక్ రూల్ ఇదే
ప్రతిరోజు కనీసం నాలుగు లీటర్ల నీళ్లను త్రాగాలి. మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి. స్వీట్లు, కూల్ డ్రింకులు, బయట దొరికే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. రాత్రివేళ కనీసం 7 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ, ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. సమయానికి కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. ఒకరోజు చేసి ఒక రోజు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చెయ్యటం వంటివి చేస్తే బరువు తగ్గకపోగా మరింత ఇబ్బంది వస్తుంది. అందుకే ఆహార నియమాలను కానీ, వ్యాయామ నియమాలను కానీ కచ్చితంగా తప్పనిసరిగా జీవితంలో భాగంగా చేసుకోవాలి. దీంతో బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఆరోగ్యంగా జీవించటం కోసం కూడా ఈ ప్రాధమిక సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
Health tips: బీపీతో పాటు బోలెడు రోగాలకు కొత్తిమీరతో చెక్.. రోజూ ఆహారంలో తీసుకోండి!!