ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక డయాబెటిస్ బారిన పడినవారు ప్రతిరోజు మందులను వాడటమే కాకుండా ఆహారం విషయంలో, వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్ తో పాటు వచ్చే అదనపు సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.