
తోటకూరలో ఉండే పోషకాలు ఇవే
అసలు ఇంతకీ తోటకూరలో ఏముంటాయి? తోటకూర మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతుంది? వంటి అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అన్ని రకాల ఆకుకూరలలో పోషకాలు ఉంటాయి. ఇక తోటకూరలో అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి. తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తోటకూర లో అన్ని రకాల విటమిన్లతో పాటు ప్రోటీన్లు, తక్కువ క్యాలరీలు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో పోషకాలు ఉండే పోషకాల గనిగా తోటకూరను చెప్పుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

అధిక బరువుకు చెక్ పెట్టండి
తోటకూరలో ఉండే అన్ని పోషకాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. నిత్యం తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే శారీరక బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటకూరను కాస్త తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి కాదు. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారు తోటకూరను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది.

దృష్టిలోప సమస్యలు తగ్గాలంటే ఈ పని చెయ్యండి
తోటకూరను రెగ్యులర్ గా ఆహారంలో తీసుకోవడం వల్ల దృష్టిలోప సమస్యలు ఏవైనా ఉంటే తగ్గుతాయి. తోటకూరలో ఉండే విటమిన్ ఏ కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దృష్టిలోపాలను తొలగిస్తుంది. రే చీకటి వంటి సమస్యలకు కూడా తోటకూరతో చక్కని పరిష్కారం దొరుకుతుంది. క తోటకూరను నిత్యం మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తోటకూరలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది.

తోటకూరతో ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా
తోటకూర మనల్ని ఆరోగ్యంగా, హుషారుగా ఉండేలా చేస్తుంది. ఇక తోటకూరను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు తగ్గుతాయి. తోటకూరలో ఉండే క్యాల్షియం ఎముకలు దృఢంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తోటకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల కొంతమేరకు ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు.

బీపీతో పాటు ఈ సమస్యలకు తోటకూర చక్కని పరిష్కారం
ఎక్కువగా తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బీపీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోటకూర బాగా పని చేస్తుంది. తోటకూర రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తోటకూరలో ఉండే ఐరన్ రక్తం వృద్ధి చెయ్యటానికి ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. మల బద్దకాన్ని కూడా తోటకూర తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పోషకాల గని అయిన తోటకూరను వద్దంటే అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టే.. రోజూ తింటే ఆరోగ్యానికి స్వాగతం పలికినట్టే ..
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.