Health
oi-Dr Veena Srinivas
చాలామంది
బరువు
తగ్గడం
కోసం,
స్లిమ్
గా
మారడం
కోసం
పడరాని
పాట్లు
పడుతుంటారు.
కొద్దిరోజులు
ఏరోబిక్
సెంటర్లలో
ఏరోబిక్స్
చేస్తే,
మరికొద్ది
రోజులు
జుంబా
డాన్స్
లు
చేస్తూ
అనేక
అవస్థలు
పడుతుంటారు.
అయితే
అవి
కూడా
రెగ్యులర్
గా
ఎప్పటికీ
చేస్తే
ఫలితం
ఉంటుంది.
కానీ
కొంతకాలం
పాటు
సీరియస్
గా
చేసి,
ఆ
తర్వాత
మా
వల్ల
కాదు
బాబోయ్
అంటూ
మానేస్తారు.
ఇక
ప్రోటీను
డ్రింక్
లు,
నేచురోపతి
వైద్యులు
చెప్పే
రక
రకాల
ఆహారాలు
ఇలా
ఒకటేమిటి
బరువు
తగ్గడం
కోసం
చేయని
ప్రయత్నాలు
ఏవీ
లేవు.
డబ్బులు
ఖర్చు
పెట్టి,
సమయం
కేటాయించి,
ట్రైనర్స్
ను
పెట్టుకొని
నానా
తంటాలు
పడేవారు..
నిజంగా,
సిన్సియర్
గా
బరువు
తగ్గాలంటే
అంత
కష్టపడాల్సిన
అవసరం
లేదనే
విషయం
తెలుసుకోవాలి.
చిన్న
చిన్న
చిట్కాలతోనే
ఈజీగా
బరువు
తగ్గొచ్చు.

బరువు
తగ్గాలి
అనుకునే
వారు
క్రమబద్ధమైన
జీవితాన్ని
అలవాటు
చేసుకోవాలి.
ప్రతిరోజూ
ఖచ్చితంగా
ఎనిమిది
గంటల
పాటు
నిద్ర
పోవడం,
తెల్లవారుజామునే
నిద్రలేవడం,
రోజూ
అరగంట
నుంచి
ముప్పావు
గంట
పాటు
శారీరక
వ్యాయామం
చేయడం
అలవాటు
చేసుకోవాలి.
ప్రతి
రోజు
ఎనిమిది
గ్లాసుల
మంచినీళ్లు
తాగేలా
చూసుకోవాలి.
అంతేకాదు
ఆహారపు
అలవాట్ల
విషయంలో
కూడా
జాగ్రత్తలు
వహించాలి.
కార్బోహైడ్రేట్లు
ఎక్కువగా
ఉండే
ఆహార
పదార్థాలను
తగ్గించి,
ప్రొటీన్,
ఫైబర్
ఎక్కువగా
ఉండే
ఆహార
పదార్థాలను
తీసుకోవాలి.
ఒత్తిడిని
తగ్గించుకోవాలి.
ప్రశాంతంగా
జీవించటం
నేర్చుకోవాలి.
ప్రతిరోజు
ఈ
చిన్న
చిన్న
జీవనశైలి
మార్పులతో
బరువును
కూడా
ఆటోమేటిక్
గా
తగ్గొచ్చని
చెబుతున్నారు.
విపరీతంగా
డబ్బు
ఖర్చుపెట్టి,
సమయాన్ని
వృధాచేసి,
ఓవర్
గా
ఎక్సర్సైజ్
చేసి..
ఆ
తర్వాత
మానేసి
రిజల్ట్
రాలేదని
చెప్పేవారు..
వాటినన్నింటినీ
పక్కన
పెట్టి
లైఫ్
స్టైల్
చేంజ్
పైన
దృష్టి
పెడితే
మంచిదని
సలహా
ఇస్తున్నారు.
ఏ
సమయానికి
నిద్ర
లేస్తున్నాం
..
ఏ
సమయంలో
తింటున్నాం..
ఏ
సమయంలో
నీళ్లను
తాగుతున్నాం..
వ్యాయామం
చేస్తున్నాం..
వంటి
అనేక
అంశాల
పైన
దృష్టిపెట్టి
చెయ్యవలసిన
అవసరం
ఉంది.
ప్రతిరోజూ
ఒకే
సమయానికి
ఈ
పనులన్నింటినీ
సక్రమంగా
నిర్వర్తిస్తే
కచ్చితంగా
జీవన
విధానంలో
మార్పు
కనిపిస్తుంది.
ఈ
విధానంలో
బరువు
తగ్గటం
కాస్త
ఆలస్యం
అయినా
కచ్చితంగా
రిజల్ట్
కనిపిస్తుంది.
బరువు
తగ్గడమే
కాకుండా
ఆరోగ్యం
గా
కూడా
ఉంటుంది.
డబ్బుకు
డబ్బు
ఆదా
అవుతుంది.
disclaimer:
ఈ
కథనం
వైద్య
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
English summary
Need to lose weight? But do these simple and inexpensive things to become slim and fit.
Story first published: Saturday, April 29, 2023, 18:25 [IST]