
పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ ఆహారాలు పెట్టండి
సాధారణంగా ఎత్తు పెరగడానికి క్యాల్షియం అవసరమవుతుంది. ఎత్తు పెరగడానికి కావలసిన కాల్షియం సోయా ప్రొడక్ట్స్ లో బాగా దొరుకుతుంది. కాబట్టి ఎత్తు పెరగాలి అనుకునేవారు సోయాబీన్స్, సోయా మిల్క్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగంగా చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక ఎత్తు పెరగడానికి పాలు కూడా కీలకంగా పనిచేస్తాయి. పాలల్లో కాల్షియం ఎండ్ గా ఉంటుంది కాబట్టి. రెగ్యులర్ గా పాలు తాగడం వల్ల కూడా ఎత్తు పెరుగుతారు.

మాంసం, గుడ్లు మంచి పౌష్టికాహారం
పిల్లల ఆహారంలో రెగ్యులర్ గా మాంసాన్ని భాగంగా చేయడం వల్ల కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు. చికెన్, మటన్ లోని ప్రోటీన్లు కండరాలు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి కావలసిన ప్రోటీన్స్ మాంసంలో ఉంటాయి కాబట్టి ఎత్తు పెరగాలనుకునే పిల్లలకు వారి ఆహారంలో మాంసాన్ని ఒక భాగం చేయాలి.
ఇక పిల్లల ఎత్తు పెరగడానికి గుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. గుడ్లలో కాల్షియంతో పాటు, ఎదుగుదలకు కావలసిన ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల పిల్లలు ఎత్తు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎత్తు పెరగటానికి ఈ కూరగాయలు, ఆకుకూరలు పెట్టండి
ఇక ఇది మాత్రమే కాకుండా ఆకుకూరలు, కూరగాయల్లో కూడా బోలెడన్ని పోషకాలు పిల్లలు ఎత్తుగా పెరగడానికి ఉపయోగపడతాయి. కూరగాయల్లో బెండకాయలలో విటమిన్లు, ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు. బెండకాయలలో ప్రోటీన్, క్యాల్షియంతో పాటుగా విటమిన్ ఏ, బి, డి, ఇ లు కూడా ఉంటాయి. పిల్లలకు బెండకాయను ఎక్కువగా తినిపిస్తే వారు ఎక్కువ ఎత్తుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆకుకూరల్లోను బచ్చలి కూర పిల్లలు ఎత్తుగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బచ్చలి కూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్, అధికంగా ఉంటాయి.

పిల్లల డైట్ విషయంలో కేర్ తీసుకుంటే పిల్లలు ఎత్తు పెరిగే అవకాశం
ఇక ఆకుకూరల్లోను మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు ఉంటాయి. ఇవి చిన్నారులు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల చిన్నారులు చక్కగా ఎత్తు పెరుగుతారు. అందుకే పిల్లలు ఎత్తుగా పెరగాలని భావించే తల్లిదండ్రులు పిల్లల డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వారికి మంచి పోషకాహారం లభించి, ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.