
ఆహారంలో ఇది తగ్గించండి
బీపీ తగ్గడం కోసం పాటించవలసిన సహజ చిట్కాలు విషయానికి వస్తే బీపీని తగ్గించుకోవాలనుకునేవారు ప్రధానంగా చేయవలసింది ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం. ఉప్పులోని సోడియం రక్తపోటు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు తగ్గించుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. తక్కువ సోడియం తో తయారు చేసుకున్న ఆహారం మందులతో సమానంగా పనిచేస్తున్నట్టు అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సోడియం తక్కువగా ఉండే పింక్ సాల్ట్ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ప్రతి రోజు 1.5 గ్రాముల కన్నా మించకుండా ఉప్పును తీసుకుంటే బీపీ ని కంట్రోల్ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. బీపీ బాగా పెరగటంలో కీలకంగా పని చేసేది సోడియం ఎక్కువగా ఉన్న ఉప్పే.. ఉప్పు తగ్గిస్తే బీపీని కచ్చితంగా కంట్రోల్ చెయ్యగలం.

బీపీని కంట్రోల్ చెయ్యటంలో వీటితో మంచి ఫలితం
బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి మన ఆహారంలో కచ్చితంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు బీపీ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అటువంటి వాటిలో ఆకుకూరలు ఒకటి. ఆకుకూరలతో బీపీ బాగా కంట్రోల్ అవుతుంది. అందుకే ఆకు కూరలతో పాటు ఆకుపచ్చని కొన్ని కూరగాయలు కూడా బీపీని కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడతాయి. పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు, క్యాబేజీ , బీన్స్ వంటివి ఎంతగానో పని చేస్తాయని అంటున్నారు.

ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోండి
ఆహారంలో రోజు ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. అరటిపండు బిపిని కంట్రోల్ చేస్తుందని సూచిస్తున్నారు. టమాటాలు, ఎండు ద్రాక్ష వంటివి కూడా రక్తపోటును తగ్గేలా చేస్తాయి. ప్రతిరోజు శరీరానికి ఎక్కువ మోతాదులో పొటాషియం అందేలా చూసుకుంటే రక్తపోటు తగ్గుతుందని చెబుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు పొటాషియం ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.

బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ పనులు చెయ్యండి
ఇక ఇదే సమయంలో బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ సాధన చేయాలని చెబుతున్నారు . రోజు 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని, ఇతరత్రా వ్యాయమాలు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ఏది ఏమైనా సహజమైన పద్ధతుల ద్వారా ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం, ఆహారంలో సోడియం తక్కువగా తీసుకోవడం, ముఖ్యంగా జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
health tips: పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు; రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!