Health
oi-Kannaiah
ప్రపంచాన్ని
కరోనా
మహమ్మారి
ఏ
విధంగా
గడగడలాడించిందో
అందరం
చూశాం.
ఎక్కడో
చైనాలో
వెలుగు
చూసిన
ఈ
ప్రమాదకర
వ్యాధి
ఏకంగా
ప్రపంచాన్నే
కుదిపేసింది.
కొన్ని
కోట్లమంది
ఈ
మహమ్మారి
బారిన
పడి
కన్నుమూశారు.
ఎన్నో
కుటుంబాల్లో
విషాదం
నింపింది.
కొంత
కాలంగా
తగ్గిన
కరోనా
కేసులు
మళ్లీ
క్రమంగా
పెరుగుతున్నాయి.
మరోసారి
ప్రమాద
ఘంటికలు
మోగిస్తున్నాయి.
తాజాగా
ఎయిర్‌ఫినిటీ
అనే
ఆరోగ్య
విశ్లేషణా
సంస్థ
ఓ
బాంబు
పేల్చింది.
రానున్న
పదేళ్లలో
కరోనా
తరహాలో
మరో
ప్రమాదకరమైన
మహమ్మారి
మానవాళిని
కబళించనున్నట్లు
ఆ
సంస్థ
వెల్లడించింది.ఇది
కోవిడ్-19
వైరస్
కంటే
ఎక్కువగా
27.5శాతం
మేరా
ప్రమాదకరంగా
ఉంటుందని
అంచనా
వేసింది.
ఈ
వ్యాధి
వేగంగా
వ్యాపించి
మనిషి
ప్రాణాలను
అంతే
వేగంగా
తీసుకుపోతుందని
వెల్లడించింది.
అయితే
సరైన
సమయంలో
వ్యాక్సిన్‌ను
కనుగొంటే
ఈ
మహమ్మారి
నుంచి
కొంత
ఊరట
పొందొచ్చని
పేర్కొంది.

అయితే
ఈ
కొత్త
మహమ్మారి
వ్యాపించేందుకు
కారణాలేంటనేదానిపై
పరిశోధన
చేసింది
ఎయిర్‌ఫినిటీ
సంస్థ.
వాతావరణంలోని
మార్పులు,
పెరుగుతున్న
అంతర్జాతీయ
ప్రయాణాలు,పెరుగుతున్న
జనాభా,
మరియు
జంతువుల
నుంచి
వ్యాపిస్తున్న
వ్యాధులే
ఈ
కొత్త
మహమ్మారి
పుట్టుకకు
కారణం
అవుతాయని
ఎయిర్‌ఫినిటీ
సంస్థ
స్పష్టం
చేసింది.అయితే
ఈ
కొత్త
వైరస్‌ను
గుర్తించిన
100
రోజుల్లోగా
వ్యాక్సిన్‌ను
కనుగొన్నట్లయితే
ఈ
మహమ్మారి
ప్రమాదశాతాన్ని
8.1శాతంకు
తగ్గించొచ్చని
అంచనా
వేసింది.
ఇక
కొత్త
వైరస్
ప్రమాదం
ఎలా
ఉంటుందో
ఉదాహరణతో
వివరించింది.
యూకేలాంటి
దేశంలో
బర్డ్
ఫ్లూలాంటి
వైరస్
ఒక
మనిషి
నుంచి
మరో
మనిషికి
వ్యాపిస్తే
ఒకే
రోజులో
15వేల
మంది
చనిపోయే
అవకాశాలున్నట్లు
పేర్కొంది.
కొత్త
వైరస్
కూడా
అంతకంటే
ప్రమాదంగా
మారే
అవకాశాలున్నట్లు
స్పష్టం
చేసింది.
ప్రస్తుతం
H5N1
బర్డ్
ఫ్లూ
ఒక్కింత
కలవరపెడుతోంది.
దీని
బారిన
కొంతమంది
పడ్డారు.అయితే
ఒక
మనిషి
నుంచి
మరో
మనిషికి
వ్యాపిస్తోందన్న
సంకేతాలు
కనిపించకపోవడం
ఊరటనిచ్చే
విషయం.
అత్యంత
ప్రమాదకరమైన
మెర్స్
(MERS),
జికా
(Zika)
లాంటి
వైరస్‌కు
ఇప్పటి
వరకు
వ్యాక్సిన్
లేదు.అదే
సమయంలో
చికిత్స
కూడా
లేదు.ఇక
ప్రస్తుతం
మరో
వైరస్
పంజా
విసిరేందుకు
సిద్ధంగా
ఉందంటూ
పలు
పరిశోధనా
సంస్థలు
ప్రపంచాన్ని
హెచ్చరిస్తున్నాయి.
అన్ని
దేశాలు
ఈ
మాయరోగాన్ని
ధీటుగా
ఎదుర్కొనేందుకు
సిద్ధంగా
ఉండాలని,
అన్ని
ముందస్తు
చర్యలు
తీసుకోవాలని
సూచిస్తున్నాయి.
English summary
There is 28% risk of new covid like pandemic in the coming 10 years warned Airfinity.
Story first published: Friday, April 14, 2023, 13:55 [IST]