• Wed. Mar 29th, 2023

24×7 Live News

Apdin News

Paneer: డయాబెటిస్ ఉన్న వారు పనీర్ తింటే ప్రమాదామా..! | Experts say that people with diabetes do not have any problems with paneer

Byadmin

Mar 29, 2023


గ్లైసెమిక్ ఇండెక్స్

గ్లైసెమిక్ ఇండెక్స్

పనీర్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినొచ్చు. ఈ పనీర్ వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు ఈ పనీర్ ను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను ఉన్నాయట. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ లో చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గిస్తుందట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రభావాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.

ముడి కాటేజ్ చీజ్

ముడి కాటేజ్ చీజ్

ముడి పనీర్ మెదడు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడడమే కాకుండా ముడి కాటేజ్ చీజ్ ను పిల్లలకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినిపించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే ఇది వారి మానసిక అభివృద్ధికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందట. పనీర్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పోరాడటానికి పన్నీర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

లినోలెయిక్ ఆమ్లం

లినోలెయిక్ ఆమ్లం

పనీర్ లో ఉండే ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది.. అంటే ఇది క్రమంగా కార్బోహైడ్రేట్లను విడుదల చేస్తుంది.ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. పనీర్ లో లినోలెయిక్ ఆమ్లం పుష్కలంగా ఉండడం వల్ల కొవ్వును వేగంగా కరిగించడానికి , జీవక్రియను పెంచేందుకు ఉపయోగపడుతుంది. పనీర్ ను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుందట. పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్ డి, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.