
క్లోరైడ్
అయితే ఇలా ప్లాస్లిక్ బాటిల్స్‌లోని నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఒక పాలిమర్ అని ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయని గుర్తు చేస్తున్నారు. ఇవి కాకుండా ప్లాస్టిక్‌లో బీపీ అనే రసాయనం ఉంటుందట. ఇది మన శరీరానికి చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు.

మైక్రోప్లాస్టిక్ కణాలు
మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల ద్వారా చేరుతుండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. మానవ మలంలో మైక్రోప్లాస్టిక్ కణాలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు దీర్ఘకాలంలో తీవ్ర వ్యాధులు కలుగజేస్తాయట. ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ మూత, సీసాల నుంచి మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

1.5 మైక్రోమీటర్లు
మానవ శరీరంలో 1.5 మైక్రోమీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు పేగు గోడల గుండా వెళ్లి కాలేయం, ఇతర భాగాల ద్వారా శరీరంలో కలిసిపోతాయి. ఇవి ఊపిరితిత్తుల వాపునకు, క్యాన్సర్ కు కారణం అవుతున్నాయిని గుర్తించారు. ప్లాస్టిసైజర్లు, స్టెబిలైజర్లు, వర్ణద్రవ్యాలు వంటి వాటితో తయారయ్యే ప్లాస్టిక్ నీళ్ల సీసాల నుంచి వచ్చే మైక్రోప్లాస్టిక్స్ రక్తం గుండా ప్రయాణిస్తాయని కనుగొన్నారు.

రాగి
ఈ ప్రమాదాల నుంచి మనం గట్టేక్కలాంటే.. ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలు వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించుకోవాల్సి వస్తే ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.