
కార్బోహైడ్రేట్లు
బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న ఆలుగడ్డ తినకపోవడమే మంచిదట. ఎందుకంటే ఆలుగడ్డలో ఉండే కార్పోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే అవకాశం ఉంటుందట. అందుకే షుగర్ ఉన్నవారు తినకపోవడమే మంచిదట. ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు.

ఊబకాయం
ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ రూపంలో కాకుండా పొట్టుతోపాటు ఉడికించిన ఆలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఎప్పుడూ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ఆలుగడ్డలను తనకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. నిజానికి ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఆలుగడ్డ జ్యూస్
ఆలుగడ్డ పొట్టులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బంగాళాదుంపలను మెంతికూర, బెండకాయ వంటి అధిక ఫైబర్ కూరగాయలతో వండటం వల్ల డయాబెటిస్ రోగులు తినొచ్చని చెబుతున్నారు. ఆలుగడ్డ దేహానికి కాకుండా సౌందర్య పోషణలోనూ ఉపయోగపడుతుందట. ఆలుగడ్డ జ్యూస్ లేదా ముక్కలతో ముఖానికి మసాజ్ చేస్తే నల్లమచ్చలు, ముడతలు తాజాగా కనబడతారట.
Note: నిపుణుల అభిప్రాయాల మేరకు ఈ సమాచారం ఇచ్చాం. దీనిని వన్ ఇండియా ధృవీకరించలేదు.