దేశంలో సైలెంట్ గా టీబీ విస్తరిస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారత్ లోనే ఉన్నారట. దీన్ని అస్సలే లైట్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ టీబీ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించింది.మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా టీబీ వస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, గర్భాశం వంటి కీలక అవయవాలను కూడా దెబ్బతీస్తుంది.