ప్రతి ఒక్కరి గాయాలు అవుతుంటాయి. అయితే అవి చిన్న గాయాలైతే మనం ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. పెద్ద గాయాలు అయితే ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. సాధారణంగా చిన్న గాయాలు అవుతుంటాయి. కూరగాయలు కట్ చేసేటప్పుడో.. వంట చేసేటప్పుడో.. ఏదో విధంగా గాయాలు అవుతాయి. అయితే ఈ చిన్న చిన్న గాయాలకు ఆస్పత్రికి వెళ్లలేరు. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద గాయంగా మారే అవకాశం ఉంటుంది.