
కాలిన గాయాలు
అందుకే ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో గాయాలను తగ్గించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
వంట చేసేటప్పుడు మీ వేళ్లు, చేతులు కాలుతుంటాయి. అప్పుడప్పుడు వేడి నూనె మీద పడి గాయాలవుతుంటుంది. ఇలా కాలిన గాయాలు అయితే మొదటి 10 నిమిషాలు గాయం చల్లగా ఉండే చేసుకోండి. కానీ నీటితో కడకుండా.. ఫ్యాన్ గాలి కింద ఉంచండి. గాయాన్ని సబ్బుతో కడగాలి.

పసుపు
గాయంపై శుభ్రమైన తడి గుడ్డను పెట్టండి. ఇది నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గాయానికి పసుపు పెట్టుకోవచ్చు. పసుపు ఒక శక్తివంతమైన యాంటిబయోటిక్ గా పని చేస్తుంది. అందుకే పసుపు ఎల్లప్పుడు వంటింట్లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. పసుపులో ఉండే హీలింగ్ ఏజెంట్స్ త్వరగా నయం కావడానికి ఉపయోగపడతాయి.

కలబంద
రక్త వచ్చే చిన్న గాయాలపై పసుపు పెట్టడం చాలా ఉపయోగం ఉంటుంది. పసుపు రాయడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా సోకదు. అలాగే గాయాలకు కలబంద బాగా పని చేస్తుంది. అందుకే కలబందను “బర్న్ ప్లాంట్” అని కూడా అంటారు. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

తేనె
కలబంద బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు కాలిని గాయాలు లేదా ఇతర గాయాలైతే స్వచ్ఛమైన కలబంద జెల్ రాసుకుంటే ఉపయోగం ఉంటుందట. తేనె రుచిగా ఉండటమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది చిన్న చిన్న గాయలను, మంటను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.